Sunday 1 July 2012

దాంపత్య జీవితంలో శృంగారమే పరమ ఔషధం

సంతృప్తికరమైన శృంగారం ఎంతో ఆరోగ్యప్రదమైనది. అనేక రుగ్మతలకు శృంగారమే పరమ ఔషధం. ఈ ఆధునిక కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాల్లో ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో మూడీగా ఉండటం సహజం. దీంతో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకునే సమయం సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. 

సంభోగ భాగ్యం లేకపోయినా ఇద్దరూ ఒక్కటిగా ఆ రాత్రి ఒక్క గంటయినా చక్కటి సంభాషణలతో గడిపినా శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్తేజం కలుగుతుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా అలిగి చెరొక గదిలో పడుకుంటే మిగిలేది శూన్యమే. 

సెక్స్‌లో సంతృప్తి చెందిన వారి ముఖాల్లో ఉదయం ఎంతో కళ కన్పిస్తుందట. వాళ్ళలో పూర్తి ఆత్మవిశ్వాసం ఉంటుందని చెపుతున్నారు. ఈ ఒత్తిడితో కూడిన సమాజంలో రాత్రి పూట సంభోగం ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. అయినా దంపతులిద్దరూ కలసి నిద్రిస్తే తెల్లవారుజామునైనా ఆ సంభోగభాగ్యం దక్కుతుందని వారు చెపుతున్నారు.

హస్త ప్రయోగం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి?

చాలా మంది యువకులకు హస్త ప్రయోగం అలవాటు ఎక్కువగా ఉంటుంది. స్వయంతృప్తి పొందకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. కొందరు రోజుకు మూడు నాలుగు సార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. అయితే, దీన్ని రోజూ చేయడం వల్ల లేనిపోని సమస్యలు ఏమైనా వస్తాయన్న ఆందోళనా వారిలో ఉంటుంది. అయితే, రోజుకు మూడు నాలుగు సార్లు చేయడం వల్ల ఇంకా చిక్కిపోతానా అనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి వారు హస్త ప్రయోగం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే కింది విధంగా చెపుతున్నారు. 

సాధారణంగా యుక్త వయస్సులో శృంగార హార్మోన్ల వలన కోర్కెలు బాగా ఉంటాయన్నారు. ఇది కేవలం కొందరిలోనే కాకుండా... అనేక స్త్రీపురుషుల్లోనూ ఉంటాయట. టీనేజ్‌ వయసులో వచ్చే సహజసిద్ధమైన మనో శారీరక స్థితిగా దీన్ని పేర్కొంటున్నారు. 

అయితే, హస్తప్రయోగం వలన ఏ మాత్రం నీరసంగానీ, ఇతర లైంగిక సమస్యలుగానీ రావు. కాకపోతే రోజుకు అన్ని సార్లు చేయడం వలన ఒక రకమైన ఆందోళన, అస్థిరత్వం ఏర్పడతాయని వైద్యులు చెపుతున్నారు. అలాగే, చదువుకోకుండా, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే చాలామంది యువకులు ఇంటర్‌నెట్‌లో అశ్లీల సైట్స్‌ చూస్తూ విపరీతమైన హస్తప్రయోగానికి పాల్పడుతుంటారని చెపుతుంటారు. 

ఇలా చేయడం వల్ల తమలోని లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందే మోనని బాధపడుతుంటారు. హస్తప్రయోగం వలన పెళ్లయ్యాక ఎటువంటి సమస్యలూ రావంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో దీనిని ఒక చికిత్సా పద్ధతిగా కూడా చేయవచ్చని కోరుతున్నారు. 

పైగా... రోజుకు ఒకసారి చేసే హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా రాదని చెపుతున్నారు. కాకపోతే అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువసార్లు చేయడం వలన మానసికంగా అది మనలను కుంగిపోయేలా చేస్తుంది.

రతిలో బాగానే తృప్తి పొందుతున్నా.. కానీ గర్భవతిని కాలేదు!!

సాధారణంగా అనేక మంది మహిళలకు వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా తల్లికాలేదన్న బెంగ ఉంటుంది. దాంపత్య జీవితంలో బాగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. గర్భం ఎందుకు రావడం లేదబ్బా అనే ఫీలింగ్ వారిని వెంటాడుతూనే ఉంటుంది. తల్లికావాలన్న తపనతో కొన్ని సందర్భాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీలపై కూడా మొగ్గు చూపుతుంటారు. 

ఇలాంటి సమస్యలపై సెక్స్‌, గైనకాలజిస్టులతో సంప్రదిస్తే... గర్భం దాల్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు సూచనలు చేస్తున్నారు. నెలసరి 12-16 రోజుల మధ్యలో అండం విడుదల అవుతుందని, ఆ రోజుల్లో సెక్స్‌లో పాల్గొంటే కలిస్తే గర్భం వచ్చే అవకాశముందని చెపుతున్నారు. 

అలాగే మహిళలు గర్భాశయం ఎలావుందో స్కానింగ్‌ ముందుగా పరీక్ష చేయించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. అదేవిధంగా భర్త వీర్యాన్ని కూడా టెస్ట్ చేయడం మంచిదని సూచన చేస్తున్నారు. కేవలం అండం విడుదల అయ్యే రోజుల్లో మాత్రమే కాకుండా... వీలైనన్నిసార్లు టెన్షన్‌ లేకుండా, కేవలం పిల్లల కోసమే సెక్స్‌లో పాల్గొనాలన్న భావన లేకుండా ప్రశాంతంగా శృంగార కార్యక్రమంలో పాల్గొంటూ.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపాలని వారు సలహా ఇస్తున్నారు.

సెక్స్‌ పూర్తికాగానే ఆకలేస్తోంది.. ఏం చేయాలి!!

చాలామంది దంపతులు పెళ్లయిన తర్వాత సెక్స్‌లో బాగానే ఎంజాయ్ చేస్తారు. ఈ ఎంజాయ్‌మెంట్ తొలి యేడాది బాగానే ఉంటుంది. అయితే, కొంతమందికి సెక్స్‌లోపాల్గొన్న తర్వాత దాహం, ఆకలి అవుతుంది. అలాగే, తలనొప్పి, నీరసం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. మరికొంతమందికి కాళ్లు చేతులు లాగుతుంటాయి. ఇలాంటి సమస్యలు పెళ్లయిన కొత్తలో లేక పోయినప్పటికీ.. క్రమేణా వస్తుంటాయి. దీంతో వారు మరింత బాధపడుతుంటారు. ఇదేమైనా వింత సమస్యా అని బెంగపెట్టుకుని జీవిస్తుంటారు. దీనిపై వైద్య నిపుణులను సంప్రదిస్తే కింది విధంగా సమధానం ఇస్తున్నారు. 

మనిషి జీవితంలో సెక్స్‌ కూడా ఒక ఎక్సర్‌సైజ్‌ వంటిదేనని చెపుతున్నారు. చాలా మందికి సెక్స్‌లో పాల్గొన్నాక గ్లాసుడు మంచి నీళ్లు తాగాలనిపిస్తుందని, అలాగే మనం తీసుకున్న ఆహారం కూడా కొన్ని కేలరీలు ఖర్చవుతుందని చెపుతున్నారు. అలాగని సెక్స్‌ పూర్తికాగానే ఏమీ తినకూడదు, తాగకూడదు అని రూలేమీ లేదంటున్నారు. 

మీకు ఆకలైతే సెక్స్‌ అయిన తర్వాత హ్యాపీగా ఏం కావాలంటే అది తినొచ్చని చెపుతున్నారు. లేదంటే గ్లాసుడు పాలు తాగొచ్చని చెపుతున్నారు. ఇలా సెక్స్‌లో పాల్గొన్నాక నీరసం, తలనొప్పి చాలా సహజంగా వచ్చేవేనని అంటున్నారు. అలాగని పాల్గొనేవారందరికీ వస్తుందని కాదంటున్నారు. 

కొంతమందికి మాత్రమే అలా వస్తుందని చెపుతున్నారు. దీనికి ప్రధాన కారణం భావప్రాప్తి సమయంలో కొందరు స్త్రీలు కండరాలు తీవ్రంగా బిగించడం వల్ల ఈ నొప్పి వస్తుందని సమాధానం ఇస్తున్నారు. సెక్స్‌ సమయంలో మనసును రిలాక్స్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే నిపుణులైన సెక్సాలజిస్టును సంప్రదించాలని కోరుతున్నారు.

సుఖ సంసారానికి కొన్ని నియమాలు!!

సెక్స్‌ మనిషికి అవసరమా? కాదా? సెక్స్‌ లేకుండా మనిషి జీవించలేడా? అంటే జవాబు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. ఆయుర్వేదం మనిషిని ముక్కలు ముక్కలుగా కాకుండా శరీరం, మనస్సు, ఆత్మ వీటన్నిటింనీ సమ్మిశ్రమంగా చెప్పి మనిషిని మొత్తంగా చికిత్స చేయాలని చెబుతుంది. అలాగే సెక్సాలజీ కూడా మనిషిని పూర్తిగా, అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించాలని చెబుతుంది. 

మనిషి, శరీరం, హార్మోనులు, పుట్టి పెరిగిన పరిస్థితులు, సామాజిక విలువలు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ఆశయాలు వీటన్నింటిని చూడాల్సి ఉంటుంది. సెక్స్‌లో పాల్గోవాలంటే పార్ట్‌నర్‌ ఇష్టా ఇష్టాలు తెలుసు కోవడం అవసరం. తమకిష్టమైనవి, లేనివి స్త్రీ తన నోటితో చెప్పలేక పోవచ్చు. అలాంటివి ఫోర్‌ప్లేలో, రతిలో ఏ మేం చేస్తుంటే ఉద్రేకం కలుగుతుంది. ఎక్కడ చేయి వేస్తే తీసి వేస్తున్నారు.. ఎక్కడ చేయి వుంచుకుంటున్నారు... ఇలాంటివి పరిశీలన ద్వారా తెలుసుకోవాలి. 

పెళ్ళికి ముందు తర్వాత వేశ్యలతో తిరిగేవారు సుఖ వ్యాధులేవీ లేకుండా చేసుకొని మాత్రమే భార్యతో శృంగారంలో పాల్గొనాలి. వేశ్యాసంభోగం మానివేస్తే మంచిది. గర్భం వద్దనుకున్నపుడు వివిధ గర్భనిరోధక పద్దుతులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి ముందుగా తెలుసుకోవాలి. 

లేకపోతే మనసులో గర్భం వస్తుందేమో అన్న భయం ఉంటే ఇద్దరూ శృంగారంలో సరిగా పాల్గొనలేకపోవచ్చును. సెక్స్‌లో కొన్ని వాటంతటవే కలిగినా కొన్ని నేర్చుకోవాల్సివుంటుంది. అంగస్తంభనాలు గర్భస్థ పిండానికి కూడా వాటంతటవే కలుగుతాయి. సెక్స్‌లో తృప్తి పొందడం, వీర్య స్ఖలనంపై నియంత్రణ, భావప్రాప్తి పొందడం ఇవి నేర్చుకోవాలి. 

అలాగే... ఏవి కామోద్రేకాన్ని కలిగిస్తాయి అన్నది నెమ్మదిగా తెలుసుకోవాలి. శృంగారంలో తృప్తినిచ్చే వాటిలో పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమే. వాత్సాయనుడు వ్యక్తిగత పరిశుభ్రత, చక్కని పరిసరాలు, సుఖంగా ఉండే బెడ్‌రూమ్‌కు ప్రాధాన్యతనిచ్చాడు. వస్త్రాలు లేకుండా ఒకరి శరీరాన్ని ఒకరు సాధ్యమైనంతసేపు ప్రేరేపించి అప్పుడు సెక్స్‌లో పాల్గొనాలి. ఫోర్‌ప్లే స్త్రీ పురుషునికి కూడా చేయాలి. 

శరీరం అలసటకు గురైనపుడు, మానసికంగా ఆందోళన లేదా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొనలేకపోవచ్చు. అలాంటప్పుడు భాగస్వామి ప్రేమానురాగాలు చూపడం ద్వారా ఆరోగ్యం తొందరగా కోలుకోవడం జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా బాగా అలసి పోయిన రోజు సెక్స్‌లో పాల్గొనకుండా విశ్రాంతి తీసుకుని వీలైతే తెల్లవారు ఝామున పాల్గొంటే మంచిది.

శృంగారంలో భాగస్వామిని ఎలా సంతృప్తి పరచాలి?

శృంగారంలో భార్యను తృప్తిప‌ర‌చాల‌ని ఏ భర్తకు ఉండ‌దు చెప్పండి. భ‌ర్తను సుఖ‌పెట్టకూడదని ఏ భార్య అయినా అనుకుంటుందా? మ‌రేందుకు స్త్రీ, పురుషులు శృంగారంలో ఎందుకు విఫ‌ల‌మ‌వుతున్నారు? అస‌లు భాగ‌స్వామిని తృప్తి ప‌ర‌చాలంటే ఏం చేయాలి? శృంగారాన్ని పెంచే మందులు తీసుకోవాలా? లేకపోతే భార్యను లేదా భ‌ర్తను తృప్తి ప‌ర‌చ‌లేమా? ఇలా ఎన్నో ప్రశ్నలు మ‌న మ‌దిలోకి పిల‌వ‌ని పేరాంటాళ్ళలా వ‌చ్చేస్తాయి. మ‌రి వీటికి స‌మాధానం ఏంటి అనే వాటిపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే...!! 

శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర‌లేదు. ఇందులో తృప్తి పొందిన దంప‌తులు లేదా ఏ ఒక్క జంట మ‌ధ్యనైనా అర‌మ‌రిక‌లు లేని జీవ‌నం సాగిపోతుంది. మ‌రి అన్ని జంట‌లు భావ‌ప్రాప్తిని ఆస్వాదిస్తున్నాయా? అన్ని జంట‌లూ శృంగారంలో త‌మ భాగ‌స్వామితో తృప్తి పొందుతున్నాయా? అనుమానమే? చాలా జంట‌లు కేవ‌లం స‌మాజానికి వెర‌సి జీవనం సాగిస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరికీ బ‌ల‌మైన శృంగార కోరిక‌లు ఉంటాయి. కాని సంతృప్తి ఉండ‌దు. 

ఏదో అవసరానికి అన్నట్లు దంపతులిద్దరూ మొక్కుబ‌డిగా ఉద్యోగం చేసిన‌ట్లు కార్యం ముగించేస్తుంటారు. దీనికే అయితే పెళ్ళి, పేరంటాలు అస‌లు అవ‌స‌రమే లేదు. ఏ సాని కొంప‌లో దూరినా ప‌ది నిమిషాల్లో మొక్కుబడి కార్యక్రమం కానించేయొ‌చ్చు. ఇందులో తాత్కాలిక ఉప‌శ‌మ‌న‌మే త‌ప్ప. భావం.. దానికున్న తృప్తి.. సంతృప్తి చెంద‌వు. మ‌రేం చేయాలి? భావ ప్రాప్తి ఏ ఒక్క శ‌రీరానికి మాత్రమే చెందినది కాదు. మ‌రీ శృంగారం విష‌యంలో ఎంత మాత్రం కాదు.

మ‌న‌సులోని కోరిక‌ను శ‌రీరంతో జ‌రిపే ర‌తి కార్యక్రమం ద్వారా తృప్తి ప‌డ‌డమే శృంగారం. ఇందుకోసం మాన‌సిక భావ‌న‌లు అవ‌స‌రం. ఏ భార్యకైనా భ‌ర్త ఎన్నటీకి ఆ జీవిత క‌థానాయ‌కుడు. భ‌ర్తకు భార్య క‌థానాయికి అనే విష‌యం ఎన్నటికీ గుర్తు పెట్టుకోవాలి? వీరి మ‌ధ్య ఓ స‌ర‌సం. ఓ సల్లాపం నిత్యకృత్యాలు అవ‌స‌రం. ఇది భార‌తీయ సాంప్రదాయం. అప్పుడే భార్యపై భ‌ర్తకు, భ‌ర్తపై భార్యకు విశ్వాసం క‌లుగుతుంది. అర‌మ‌రిక‌లు లేకుండా మాట్లాడుకోవాలి. ఇక ఆ త‌ర్వాత చూడ‌డండి మీ దాంప‌త్యం ఆద‌ర్శం అవుతుంది. శృంగారం సాగ‌ర తీరం అవుతుంది.

ఇంకా కొంద‌రైతే తాను ఇలా చేస్తే భార్య ఎక్కడ ఇబ్బంది ప‌డుతుంద‌నో, శృంగారంలో ఇలా వ్యవ‌హ‌రిస్తే భ‌ర్త ఎక్కడ ఫీల‌వుతాడోన‌ని ఇద్దరూ… ఒక‌రినొక‌రు ఇబ్బంది పెట్టుకోరు. త‌మ భావాలు బయటపెడితే.. ఏమనుకుంటారోన‌ని అనుమానం. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలని ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేయాలి? ఇది ప్రపంచంలో చాలా జంట‌ల మ‌ధ్య ఉన్న స్వభావ‌మే. కొత్తేమి కాదు. చాలా జంట‌ల్లో శృంగారప‌ర‌మైన అభిప్రాయ భేదాలు ఉంటాయి. 

శృంగారం భార‌తీయ సంప్రదాయంలో భాగం అయ్యింది. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గ‌డ‌పాలి. ఈ ప్రపంచంలో తాము త‌ప్ప ఇంకెవ‌రూ లేరు అనే భావ‌న‌కు రావాలి. ఆ త‌రువాత ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవాలి. దీని ద్వారా శృంగార భాగ‌స్వామి ఇష్టాఇష్టాలు బ‌య‌ట ప‌డుతాయి. పైగా సెక్స్‌కు ముందు ఉత్తేజాన్ని పొందుతారు. ఒక‌రిపై ఒక‌రికి ఇష్టం పెరుగుతుంది కూడా. ఆపై జ‌రిగే శృంగారాన్ని మీరే అనుభ‌వించండి.

సుగంధ కుసుమాలతో ఎగసిపడే సెక్స్ ఉద్దీపనలు..

మత్తు కలిగించే పరిమళాలు, సుగంధ కుసుమాలు నాసికాపుటలకి తన్మయత్వం కలిగించడమే కాకుండా, లైంగిక ఉద్దీపనలను కలిగిస్తాయి. చక్కని రుచి ఉండే కాఫీ చక్కటి వాసనను కలిగి ఉంటుంది. అటువంటి కాఫీని భార్య ప్రేమపూర్వకంగా భర్తకు అందిస్తే అందులోని పరిమళం లైంగిక ఉద్దీపన కలిగిస్తుంది. అందుకే మంచి కాఫీ తాగేటపుడు భార్యను మృదువుగా స్పృశిస్తూ ఉండకుండా ఉండలేడు భర్త.

అదేవిధంగా ప్రేమపూర్వకమైన చూపులు, క్రేజీ లుక్స్ సెక్సీ ఫీలింగ్స్‌ను పుట్టిస్తాయి. తీయని గొంతులు, మధురమైన మాటలు, లైంగిక ఉద్దీపనను కలిగిస్తాయి. అందుకే ఆ ఫీలింగ్‌లో ఉన్నవారు తమ స్వరాన్ని మరింత కీచుగా మార్చి ముద్దులు పోతూ మాట్లాడుతుంటారు. ఆ మాటలు అవతలివారికి చిత్రంగా ఉన్నప్పటికీ, ఆ గొంతులో వయ్యారాలు పలికిస్తూనే ఉంటారు. అలా తన భార్య లేదా భర్తలను సెక్స్ ఉద్దీపనలకు సిద్ధం చేస్తారు. 

అంతేకాదు... వీనులవిందైన సంగీతం కూడా లైంగిక ఉద్దీపనను రేపుతుంది. కొన్ని పర్యాయాలు సంబంధం లేకుండానే కొన్ని కారణాలు సెక్స్ ఉద్దీపనలను శిఖరానికి చేరుస్తాయి. ఆ సమయంలో భాగస్వామితో సెక్స్ చేయకుండా ఉండలేరన్నది సెక్సాలజిస్టుల మాట.